సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు చేసింది రియానే: సుశాంత్ మాజీ సిబ్బంది

  • సుశాంత్ కు డగ్స్ ఇచ్చింది రియానే
  • సుశాంత్ జీవితాన్ని రియా తన చేతిలోకి తీసుకుంది
  • సీబీఐ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఊపందుకుంది. ఈ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు డ్రగ్స్ కోణం కూడా బయటపడింది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వద్ద పని చేసిన ఒక వ్యక్తి కీలక విషయాలను వెల్లడించారు.

జనవరి వరకు సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు లేదని అతను తెలిపాడు. సుశాంత్ జీవితంలోకి రియా చక్రవర్తి వచ్చిన తర్వాత అతనికి డ్రగ్స్ ఇవ్వడం జరిగిందని... అతను డ్రగ్స్ తీసుకునేలా చేసిందని చెప్పాడు. అయితే డ్రగ్స్ కు సుశాంత్ బానిస కాలేదని తెలిపాడు. సుశాంత్ కు మందు తాగడం, సిగరెట్లు కాల్చే అలవాటు మాత్రం ఉన్నాయని చెప్పాడు.

ఓ సినిమా షూటింగ్ లో సుశాంత్, రియా కలుసుకున్నారని... ఆ తర్వాత రిలేషన్ షిప్ లో ఉన్నారని అతను తెలిపాడు. సుశాంత్ జీవితాన్ని రియా తన చేతుల్లోకి తీసుకుందని... సీబీఐ దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పాడు.

Naga Susheela
Rhea Chakraborthy
Bollywood
Drugs

More Telugu News